Sinquefield Cup 2025 Chess Tournament: ఇవాళ్టి నుంచి సింక్ ఫీల్డ్ కప్ 2025 చెస్ టోర్నమెంట్
సింక్ ఫీల్డ్ కప్ 2025 చెస్ టోర్నమెంట్;
Sinquefield Cup 2025 Chess Tournament: ప్రతిష్టాత్మకమైన సింక్ ఫీల్డ్ కప్ 2025 చెస్ టోర్నమెంట్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఇది సెయింట్ లూయిస్ చెస్ క్లబ్‌లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ గ్రాండ్ చెస్ టూర్ 2025లో చివరి లెగ్. ఇక్కడ విజయం సాధించినవారు గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.
ఇందులో ప్రపంచంలోని అత్యుత్తమ చెస్ గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటారు. ఈసారి, టోర్నమెంట్‌లో తొమ్మిది మంది పూర్తి-టూర్ ఆటగాళ్ళు, ఒక వైల్డ్‌కార్డ్ ప్లేయర్ ఉంటారు. భారత్ నుంచి కూడా ఇద్దరు యువ గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్ మరియు ఆర్. ప్రజ్ఞానంద పాల్గొంటారు. ప్రస్తుతం గ్రాండ్ చెస్ టూర్ పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉండగా, గుకేశ్ అతడి కంటే వెనుకంజలో ఉన్నాడు.
ఇది క్లాసికల్ చెస్ ఫార్మాట్‌లో పది మంది ఆటగాళ్లతో రౌండ్-రాబిన్ టోర్నమెంట్‌గా జరుగుతుంది.ఈ టోర్నమెంట్ ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. పది మంది వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో తొమ్మిది రౌండ్లు జరిగే ఈ టోర్నమెంట్‌కు రూ. 3 కోట్ల పైచిలుకు ప్రైజ్‌మనీ ఉంది.ఈ టోర్నమెంట్‌ను చెస్ అభిమానులు ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమ్ ద్వారా చూడొచ్చు.