Smriti Mandhana: రెండో స్థానంలో స్మృతి మంధాన

స్మృతి మంధాన;

Update: 2025-07-30 06:18 GMT

Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్ రెండో ప్లేస్ కు పడిపోయింది.ఐసీసీ నిన్న విడుదల చేసిన ర్యాంకింగ్స్ లిస్టులో 731 రేటింగ్ పాయింట్లతో నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్) ఫస్ట్ ప్లేసులో నిలవగా..728 పరుగులతో స్మృతి మంధాన రెండో ప్లేసులో ఉంది. 719 రేటింగ్ పాయింట్లతో మూడో ప్లేసులో లారా వోల్వార్డ్ (సౌతాఫ్రికా) - ఉన్నారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన కాకుండా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా టాప్ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నారు.

బౌలింగ్ లో సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లాండ్) ఫస్ట్ ప్లేసులో ఉండగా.. సాదియా ఇక్బాల్ (పాకిస్థాన్) రెండో ప్లేస్, అన్నబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా) మూడు, దీప్తి శర్మ (భారత్) నాల్గో స్థానంలో ఉన్నారు.

ఆల్ రౌండర్ లిస్టులో యాష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా) - 470 రేటింగ్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్, హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) - 420 రేటింగ్ పాయింట్లతో రెండు, మరిజాన్నే క్యాప్ (సౌతాఫ్రికా) - 404 రేటింగ్ పాయింట్లతో మూడో ప్లేస్, దీప్తి శర్మ (భారత్) - 369 రేటింగ్ పాయింట్లతో నాల్గో ప్లేసులో ఉన్నారు. 

Tags:    

Similar News