Smriti Mandhana: టీ20, వన్డేల్లో స్మృతి మంధాన హవా...

స్మృతి మంధాన హవా...;

Update: 2025-07-02 04:46 GMT

Smriti Mandhana:  ఇండియా విమెన్స్ టీం వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వన్లేడ్లోనూ, టీ20ల్లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే వన్డేల్లోటాప్ ర్యాంక్ లో కొనసాగుతున్న మంధాన ఇపుడు టీ20ల్లోనూ తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్ ను అందుకుంది.

జులై 1న ప్రకటించిన మహిళా టీ20 ర్యాంకింగ్స్ లో 771 రేటింగ్ పాయింట్స్ తో మంధాన మూడో స్థానానికి చేరుకుంది. ఆమె కెరీర్లో ఇవే హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లు కావడం విశేషం . ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో సెంచరీతో చెలరేగింది. 62 బంతుల్లోనే 112 పరుగులు చేసి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించింది. బెత్ మూనీ 794, హేలీ మాథ్యూస్ 774 టాప్-2లో కొనసాగుతున్నారు. ఓపెనర్ షెఫాలీ వర్మ 13వ ర్యాంక్లో ఉండగా, హర్లీన్ డియోల్ 86వ ర్యాంక్ సాధించింది. బౌలింగ్ ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ 735 రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయింది.

ఇక అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా భారత టీ20 జట్టులో స్థానం సంపాదించిన ఓపెనర్ షఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్ లో 13వ స్థానం నుంచి 12వ స్థానానికి ఎగబాకింది. తొలి టీ20లో 22 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఆమె ర్యాంక్ మెరుగవ్వడం విశేషం.

Tags:    

Similar News