Smriti Mandhana’s Wedding Called Off: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్..అసలేం జరిగిందంటే.?
అసలేం జరిగిందంటే.?
Smriti Mandhana’s Wedding Called Off: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన తన వివాహం రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని స్మృతి మంధాన తన సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ) ద్వారా వెల్లడించారు."వివాహం రద్దు చేయబడింది (అని స్పష్టం చేయాలనుకుంటున్నాను.నేను చాలా గోప్యతను కోరుకునే వ్యక్తిని. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని, ముందుకు సాగడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను... ఇక ముందుకు సాగే సమయం ఆసన్నమైంది.
నా దృష్టి ఎల్లప్పుడూ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడంపైనే ఉంటుంది. వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడాలని, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను.అలాగే పలాష్ ముచ్చల్ కూడా తన వ్యక్తిగత సంబంధం నుంచి "ముందుకు సాగాలని" నిర్ణయించుకున్నట్లు ధృవీకరిస్తూ, నిరాధారమైన పుకార్లను నమ్మవద్దని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ముందుగా నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం స్మృతి మంధాన తండ్రి, పలాష్ ముచ్చల్ ఇద్దరూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం వల్ల వాయిదా పడింది.అయితే డిసెంబర్ 7 న స్మృతి మంధాన , పలాష్ ముచ్చల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ద్వారా తమ వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.