South Africa Takes Charge in Second Test: రెండో టెస్టులో సౌతాఫ్రికా బ్యాటింగ్..స్కోర్ ఎంతంటే.?
స్కోర్ ఎంతంటే.?
South Africa Takes Charge in Second Test: ఇండియాతో జరుగుతోన్న సెకండ్ టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఫస్ట్ టెస్ట్ గెలిచి ఊపు మీదున్న సఫారీలు ఈ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇక ఫస్ట్ టెస్ట్ ఓడి విమర్శల పాలైన టీమిండియా ఈ టెస్టులో ఎలాగైనా గెలవాలనే కసి మీద ఉంది. టీమిండియా ఈ టెస్ట్ గెలిస్తే సిరీస్ సు 11తో సమం చేయవచ్చు. లేదంటే టెస్ట్ డ్రా చేసుకున్నా..ఓడినా సిరీస్ సఫారీలకే దక్కుతుంది. సౌతాఫ్రికా 11 ఓవర్లు ముగిసే సరికి 26 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్క్ రమ్ 11, రికెల్టన్ 7 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
దక్షిణాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, సెనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్
భారత జట్టు
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్