Harmanpreet Kaur Sets New Milestones: అద్భుత సెంచరీతో అదిరే రికార్డులు సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్

రికార్డులు సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్;

Update: 2025-07-23 11:02 GMT

Harmanpreet Kaur Sets New Milestones: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన సెంచరీతో మెరిసింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో.. భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. హర్మన్‌ప్రీత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ గ్రౌండ్ ఫోర్లతో రఫ్పాడించింది. దీంతో కేవలం 82 బంతుల్లోనే సెంచరీని సాధించింది.

ఈ సెంచరీతో, హర్మన్‌ప్రీత్ వన్డే క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేసింది. దీనితో ఆమె ఈ ఘనత సాధించిన మూడవ భారతీయ మహిళా బ్యాట్స్‌మన్‌గా నిలిచింది. దీనికి ముందు మిథాలీ రాజ్, స్మృతి మంధాన ఈ ఘనత సాధించారు. ఈ సెంచరీతో ఆమె వన్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించింది. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్, భారత్‌కు చెందిన మిథాలీ రాజ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ ఇంగ్లాండ్‌లో చెరో 2 వన్డే సెంచరీలు సాధించారు. ఇప్పుడు, హర్మన్‌ప్రీత్ కౌర్ తన మూడో సెంచరీతో కొత్త చరిత్ర సృష్టించింది.

అదేవిధంగా వన్డే క్రికెట్‌లో భారత్ తరపున 90 బంతుల్లోపు అత్యధిక సెంచరీలు చేసిన మహిళా క్రీడాకారిణిగా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు నమోదు చేసింది. 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో హర్మన్‌ప్రీత్ కేవలం 85 బంతుల్లోనే సెంచరీ చేసింది. ఇప్పుడు 82 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఇంగ్లాండ్‌లో వన్డే క్రికెట్‌లో 1000 పరుగులు చేసిన రెండవ టీమిండియా మహిళా బ్యాట్స్‌మన్‌గా కూడా ఆమె నిలిచింది. దీనికి ముందు మిథాలీ రాజ్ మాత్రమే ఈ ఘనతను సాధించింది. 

Tags:    

Similar News