Star All-Rounder Ravindra Jadeja: డబ్ల్యూటీసీలో ఒకే ఒక్కడు జడేజా

ఒకే ఒక్కడు జడేజా

Update: 2025-11-18 06:22 GMT

Star All-Rounder Ravindra Jadeja: స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డులను సృష్టించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 2,000 కంటే ఎక్కువ పరుగులు , 150 కంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఆటగాడు రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.

ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడుగా జడేజా. ఈ అసాధారణమైన ఆల్-రౌండ్ ప్రదర్శన వేరొక ఆటగాడికి కూడా సాధ్యం కాలేదు. టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది బ్యాటర్లలో జడేజా కూడా ఒకరు. WTC చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడవ స్పిన్నర్‌గా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) తర్వాత జడేజా రెండవ స్థానంలో ఉన్నాడు. ఒక WTC సైకిల్‌లో 50 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్‌గా (అశ్విన్ తర్వాత) నిలిచారు.

ఓవరాల్ టెస్ట్ కెరీర్ రికార్డులు

:టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4,000 పరుగులు ,300 వికెట్లు తీసిన నాల్గవ ఆటగాడిగా, అలాగే రెండవ భారతీయుడిగా (కపిల్ దేవ్ తర్వాత) అరుదైన రికార్డు సాధించారు. ఈ ఘనతను ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డేనియల్ వెట్టోరి మాత్రమే సాధించారు.రవీంద్ర జడేజా తన ఆల్-రౌండ్ ప్రతిభతో WTCలో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జడేజా టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 88 టెస్టుల్లో 119 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 38.63 యావరేజ్ తో 4035 పరుగులు చేశాడు. వీటిలో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికి వస్తే 163 ఇన్నింగ్స్ ల్లో 24 యావరేజ్ తో 342 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం, జడేజా ఐసీసీ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

Tags:    

Similar News