Jofra Archer: నాలుగేళ్ల తర్వాత టెస్టులోకి స్టార్ బౌలర్
టెస్టులోకి స్టార్ బౌలర్;
Jofra Archer: టీమిండియాతో ఫస్ట్ టెస్ట్ గెలిచి జోష్ మీదున్న ఇంగ్లాండ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 రెండో టెస్ట్ ఆడనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. జట్టులో కొత్తగా ఫాస్ట్ బౌలర్ ను ఆర్చర్ ను చేర్చింది. మిగిలిన జట్టును అలాగే ఉంచింది. అంతకముందు ఉన్న 14 మంది ప్రాబబుల్స్ లో ఎవరినీ తప్పించలేదు.
నాలుగేళ్ల తర్వాత ఆర్చర్ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. చెస్టర్-లె-స్ట్రీట్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ లో భాగంగా డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ తరపున ఈ స్పీడ్‌స్టర్ 14 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మే 2021 తర్వాత ఆర్చర్ తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడడం విశేషం. ఈ మ్యాచ్ లో ఇబ్బందిపడకుండా బౌలింగ్ చేసిన ఈ ఇంగ్లాండ్ పేసర్.. ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ స్పెల్ తో తాను రెండో టెస్టుకు రెడీ అని సంకేతాలు ఇచ్చాడు.
టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్