Heinrich Klaasen: ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్

Update: 2025-06-03 03:38 GMT

Heinrich Klaasen: సౌతాఫ్రికా పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెప్పాడు. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు 33 ఏండ్ల క్లాసెన్ సోమవారం ప్రకటించాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో పాటు ఫ్రాంచైజీ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై దృష్టి పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. క్లాసెన్ గత ఏడాది జనవరిలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు వన్డేలు, టీ20ల నుంచి కూడా వైదొలుగుతున్నాడు. అతను సౌతాఫ్రికా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడి మొత్తం 2,764 రన్స్ చేశాడు.

‘ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం చాలా బాధగా ఉంది. నా ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్యామిలీ కోసం ఏది మంచిదో చాలాకాలం ఆలోచించి ఈ కష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయంతో నేను ప్రశాంతంగా ఉన్నాను’ అని క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నాడు.

మరోవైపు టీ20లపై ఫోకస్ పెట్టేందుకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్ వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పుకున్నాడు. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే చ్చే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టినట్టు చెప్పాడు. తన శరీరం అంతగా సహకరించకపోవడంతో వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు.

Tags:    

Similar News