Star Yannick Sinner: వింబుల్డన్ లో ఇటలీ స్టార్ చరిత్ర

ఇటలీ స్టార్ చరిత్ర;

Update: 2025-07-14 06:06 GMT

Star Yannick Sinner:  ఇటలీకి స్టార్ యానిక్ సిన్నర్ తొలిసారి 2025 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించాడు. ఫైనల్‌లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్‌కు చెక్ పెట్టాడు. 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి రికార్డ్ సృష్టించాడు.

ఈ విజయంతో యానిక్ సిన్నర్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి ఇటాలియన్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇది అతని కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతంలో అతను 2024, 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2024లో US ఓపెన్ గెలుచుకున్నారు. గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో అల్కరాజ్ చేతిలో ఓటమి పాలైన సిన్నర్ ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నాడు. విన్నర్ యానిక్ సిన్నర్ కు రూ. 34.82 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా.. అల్కరాజ్ కు 17.64 కోట్లు రానుంది.

Tags:    

Similar News