Sunrisers Hyderabad: సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్..కమిన్స్ వచ్చేశాడు
కమిన్స్ వచ్చేశాడు
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. పాట్ కమిన్స్ బెంగళూరు చినస్వామి స్టేడింయలో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. కమిన్స్ రాకతో జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు. ప్రాక్టీస్ సెషన్‌లో తన సహజసిద్ధమైన వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను పరీక్షిస్తున్నాడు. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ డ్రిల్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటూ జట్టు సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నాడు. అయితే ఈ నెల 28తో ఆర్సీబీతో జరగనున్న ప్రారంభ మ్యాచ్ లో పాల్గొంటాడా లేదా అనేది క్లారిటీ లేదు
కమిన్స్ రాకతో నెట్స్‌లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఒక పక్క 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ కొనసాగుతున్న తరుణంలో, కెప్టెన్‌గా కమిన్స్ తన వ్యూహాలను ఎలా అమలు చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సన్ రైజర్స్ టీమ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. 'సైలెంట్ కిల్లర్' తన వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యర్థులను తన పేస్ తో, తెలివైన కెప్టెన్సీతో కట్టడి చేసేందుకు కమిన్స్ గన్ లా సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ సీజన్ లో సన్ రైజర్స్ జైత్రయాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.