T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో కివీస్ రికార్డ్ విక్టరీ

కివీస్ రికార్డ్ విక్టరీ

Update: 2026-02-11 05:44 GMT

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పై భారీ విజయం సాధించింది.యూఏఈ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 173/6. కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ (66*) , అలీషాన్ షరాఫు (55) అద్భుతంగా రాణించారు. చివరి ఐదు ఓవర్లలో యూఏఈ 4 వికెట్లు కోల్పోయి 51 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. అనంతరం టార్గెట్ బరిలో న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలోనే 175/0 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

కివీస్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (89), ఫిన్ అలెన్ (84) యూఏఈ బౌలర్లను చిత్తు చేస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. వీరిద్దరూ నెలకొల్పిన 175 పరుగుల అజేయ భాగస్వామ్యం, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా నమోదైన అత్యధిక భాగస్వామ్యంగా రికార్డు సృష్టించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీ20 వరల్డ్ కప్‌లో ఒక జట్టు ఛేదించిన అతిపెద్ద లక్ష్యాలలో ఇది ఒకటి. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 150 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పైగా లక్ష్య ఛేదనలో ఇది మూడో అత్యుత్తమం (28 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిగిలి ఉండగా). స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌X ఒమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌X ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (37) ముందున్నాయి.ఈ విజయంతో గ్రూప్-డి లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది.. సిఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.

Tags:    

Similar News