T20 World Cup 2026: ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇదే సరైన సమయం

ఇదే సరైన సమయం

Update: 2026-02-20 06:08 GMT

T20 World Cup 2026: T20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌కు ముందు ఓమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు వరుస ఓటములతో (జింబాబ్వే, శ్రీలంక చేతిలో) ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో జతీందర్ సింగ్ మీడియాలో మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇదే సరైన సమయం" అని ధీమా వ్యక్తం చేశారు.

T20 అనేది మొమెంటం మీద నడిచే ఆట అని, ఆ రోజు మైదానంలో కీలక సమయాల్లో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళే గెలుస్తారని ఆయన పేర్కొన్నారు.: ఆస్ట్రేలియా ప్రస్తుతం ఫామ్‌లో లేదని, వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని, అందుకే వారిని 'క్రష్' (Crush) చేయడానికి ఇదే 'బెస్ట్ టైమ్' అని ఆయన అన్నారు.తమ జట్టు ఆటగాళ్లు చాలా సానుకూలంగా ఉన్నారని, పటిష్టమైన ఆస్ట్రేలియాపై గెలిచి ప్రపంచ క్రికెట్‌లో తమ ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు.

ఇదివరకు 2024 T20 ప్రపంచకప్‌లో కూడా అప్పటి ఓమన్ కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో ఆస్ట్రేలియా బ్యాటర్లకు స్పిన్‌ను ఎదుర్కొనే సరైన టెక్నిక్ లేదని ఆయన విమర్శించారు. అయితే, ప్రస్తుత 2026 టోర్నీలో కెప్టెన్సీ బాధ్యతలు జతీందర్ సింగ్ చూస్తున్నారు.ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టుపై ఓమన్ లాంటి పసికూన విజయం సాధిస్తే అది ఈ ప్రపంచకప్‌లోనే అతిపెద్ద సంచలనం అవుతుంది.

Tags:    

Similar News