T20 World Cup Schedule: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.

షెడ్యూల్ వచ్చేసింది.;

Update: 2025-06-18 12:20 GMT

T20 World Cup Schedule: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ జూన్ 12 నుండి జూలై 5 వరకు జరుగుతుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. మహిళా క్రికెట్ లో తొలిసారి తొలిసారిగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో మహిళా ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఎడిషన్ కాబోతుంది.

మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో ఆరు జట్లు ఉంటాయి. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్ ఉన్నాయి. మరో రెండు జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్ ఆడి అర్హత సాధిస్తాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి.

మరో రెండు జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్ ఆడి అర్హత సాధిస్తాయి. ప్రతి గ్రూప్ నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి.ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14 న ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. జూన్ 30, జూలై 2 తేదీలలో వరుసగా రెండు సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ది ఓవల్‌ సెమీ ఫైనల్ కు ఆతిధ్యమిస్తుంది. జూలై 5న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ జరుగుతుంది.

Tags:    

Similar News