Target: టార్గెట్ సిరీస్..

టార్గెట్ సిరీస్..;

Update: 2025-07-04 15:52 GMT

Target: టీమిండియా మహిళల జట్టు ఊపుమీదుంది. ఇంగ్లాండ్ తో ఇప్పటికే రెండు టీ20లు గెలిచిన ఇండియా కాసేపట్లో రాత్రి 11:05గంటలకు మూడో టీం ఆడనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 3–0 లీడ్‌‌‌‌తో సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

2006లో డెర్బీలో జరిగిన ఏకైక మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించింది. అప్పట్నించి ఇంగ్లండ్‌‌‌‌తో ఇంటా, బయటా జరిగిన ప్రతీ టీ20 సిరీస్‌‌‌‌లోనూ ఇండియా విఫలమైంది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఇండియా అన్ని రంగాల్లో అద్భుతంగా ఆడింది. వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన, హర్లీన్‌‌‌‌ డియోల్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన ఇంగ్లండ్‌‌‌‌ ప్రతీకారంపై దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌‌‌‌ గెలిచి సిరీస్‌‌‌‌ చేజారకుండా చూసుకోవాలని లెక్కలు వేస్తోంది. అయితే ఓపెనర్లు సోఫియా డంక్లే, వ్యాట్‌‌‌‌ హాడ్జ్‌‌‌‌ అనుకున్న స్థాయిలో శుభారంభాన్నివ్వలేకపోతున్నారు. ఇంగ్లిష్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒక్కరు కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు. 

Tags:    

Similar News