Team India : 77 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా
రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా;
Team India : టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-2తో సమం చేసింది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచి 77 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. విదేశీ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచిన మొదటిసారిగా టీమిండియా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మన హైదరాబాదీ ప్లేయర్ సిరాజ్ అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసింది. భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో సిరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 2వ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు .. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అతని అద్భుతమైన ప్రదర్శనతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 23 వికెట్లు తీసి సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.