Check on Star Culture: టీమిండియాలో స్టార్ కల్చర్ కు చెక్ పెడుతున్నారా.?

చెక్ పెడుతున్నారా.?;

Update: 2025-08-06 11:10 GMT

Check on Star Culture:  టీమిండియాలో స్టార్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ సిద్దమవుతోన్నారు. రెస్ట్ పేరుతో కీలక మ్యాచ్ లకు దూరంగా ఉంటూ సెలక్టివ్ మ్యాచ్ లు ఆడేవారికి చెక్ పెట్టనున్నారు. ఒత్తిడి పేరుతో మ్యాచ్ లకు రెస్ట్ తీసుకునే కల్చర్ ను దూరం పెట్టేందుకు బీసీసీఐతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్ చెప్పిన ప్రతిసారి సుదీర్ఘ స్పెల్స్ వేసి, దేశం కోసం తన శక్తి మేరకు కృషి చేశాడు. సిరాజ్ ఆటతీరును ప్రశంసించిన గంభీర్, సిరాజ్ పనిభారం అనే పదాన్ని పూర్తిగా తొలగించేశాడని అన్నారు. గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి, ఆటగాళ్ల పనిభారం అనే అంశంపై మరింత కఠినంగా, నిష్పాక్షికమైన విధానాన్ని అమలు చేయాలని బీసీసీఐకి సూచించినట్లు సమాచారం.

ఆటగాళ్ల పనిభారం' (workload) అంశంపై ఇప్పటికే చాలా సార్లు మొహమాటం లేకుండా చెప్పేశారు గంభీర్. ఆటగాళ్లు ఫిజికల్‌గా కంటే, ఎక్కువగా మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్యమని గంభీర్ భావిస్తారు. పనిభారం అనేది ఒక మానసిక అంశం తప్ప, అది పెద్ద శారీరక సమస్య కాదని ఆయన తరచూ చెబుతుంటారు.

దేశం తరపున ఆడేటప్పుడు చిన్న చిన్న నొప్పులను, అలసటను పట్టించుకోకూడదని చెబుతున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికులతో ఆటగాళ్లను పోలుస్తూ, దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లు తమ వంతు కృషి పూర్తిగా చేయాలని సూచించారు. పనిభారం పేరుతో ఆటగాళ్లు ముఖ్యమైన మ్యాచ్‌లను లేదా సిరీస్‌లను ఎంచుకొని ఆడటాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది జట్టుకు నష్టం కలిగిస్తుందని, ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News