Team India on Fire.. : ధనాధన్ టీమిండియా.. తొలి రోజు భారీ స్కోర్.. డబుల్ సెంచరీ దిశగా జైశ్వాల్.
తొలి రోజు భారీ స్కోర్.. డబుల్ సెంచరీ దిశగా జైశ్వాల్.
Team India on Fire.. : ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దుమ్ము రేపుతోంది. మన యంగ్ బ్యాటర్లు బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత సెంచరీ చేశాడు. ఇది అతనికి 7వ టెస్టు సెంచరీ. యశస్వి ఏకంగా 173 పరుగులతో ఇంకా క్రీజులోనే ఉన్నాడు. డబుల్ సెంచరీకి అతి దగ్గరలో ఉన్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (20) తో కలిసి స్కోర్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.
సాయి సుదర్శన్ అదుర్స్!
యశస్వితో పాటు యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా ఆడాడు. సుదర్శన్ 87 పరుగులు చేసి, తృటిలో తన తొలి టెస్టు సెంచరీ మిస్ చేసుకున్నాడు.
అతను 165 బంతుల్లో 12 ఫోర్లు కొట్టాడు. జైశ్వాల్-సుదర్శన్ కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) మంచి ఆరంభాన్ని అందించి, దాన్ని భారీ స్కోర్‌గా మార్చలేకపోయాడు.
విండీస్ బౌలర్లలో ఒక్కడే!
వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ మాత్రమే మెరిశాడు. అతనొక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లంతా మన బ్యాటర్ల దెబ్బకు తేలిపోయారు. కాగా టీమిండియా ఇప్పటికే తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ భారత్ భారీ విజయం సాధించేలా కనిపిస్తోంది.