Cricket: టీమిండియా స్పిన్నర్ ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరంటే..?
అమ్మాయి ఎవరంటే..?;
Cricket:టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాడు. తన చిన్ననాటి ఫ్రెండ్ వంశికను పెళ్లి చేసుకోబోతున్నాడు. లక్నోలో వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. బంధువులు, ఆత్మీయుల మధ్య కుల్దీప్, వంశిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో కుల్దీప్ పెళ్లి చేసుకోబోతున్న వంశిక ఎవరంటూ నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జన్మించింది. ప్రస్తుతం ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. చిన్నప్పటి నుంచే కుల్దీప్ - వంశిక ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి ఇళ్లలోనూ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.
కాగా కుల్దీప్ ఐపీఎల్లో ఢిల్లీ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంతో ఫైనల్ మ్యాచ్ జరిగిన తెల్లారే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. కాగా టీమిండియా జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఆ దేశంతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టూర్ కు కుల్దీప్ యాదవ్ ఏకైక స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన తరువాతనే కుల్దీప్ పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది.