Team India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే

టీ20 సిరీస్ కు భారత జట్టు ఇదే

Update: 2025-12-04 05:20 GMT

Team India Squad: దక్షిణాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును కెప్టెన్‌గా నడిపించనున్నారు.గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ,తిలక్ వర్మ,హార్దిక్ పాండ్యా,శివమ్ దూబే,అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్,కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్ టన్ సుందర్

ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇది 2026 టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News