Team India: టీమిండియా అతి పెద్ద సమస్య ఇదే..

అతి పెద్ద సమస్య ఇదే..;

Update: 2025-06-30 05:23 GMT

Team India: ఇండియా,ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టెస్టు జూలై 2న బర్మింగ్ హమ్ లో జరగనుంది. ఫస్ట్ టెస్ట్ లో ఓటమి పాలైన టీమిండియా సెకండ్ టెస్టులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బౌలర్లు, బ్యాటింగ్ లైనప్ పై దృష్టిపెట్టింది.

అయితే టీమిండియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య లోయర్‌‌ ఆర్డర్‌‌ బ్యాటింగ్‌‌. దీన్ని బలోపేతం చేసే క్రమంలో నాణ్యమైన బౌలర్లను పక్కనబెట్టాల్సి వస్తోంది. టెస్ట్‌‌లు గెలవాలంటే టీమ్‌‌లో కచ్చితంగా ఐదుగురు నాణ్యమైన బౌలర్లు ఉండాలి. ఇందులో ఒక ఆల్‌‌రౌండర్‌‌ ఉంటే సరిపోతుంది. కానీ తొలి టెస్ట్‌‌లో జడేజాతో పాటు శార్దూల్‌‌ను ఆల్‌‌రౌండర్‌‌గా ఆడించి ఓ బౌలింగ్‌‌ ఆప్షన్‌‌ను తక్కువ చేసుకుంది. ఎక్కువ రన్స్‌‌ చేయడానికి బదులుగా ప్రత్యర్థిని వీలైనంత త్వరగా ఔట్‌‌ చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలి. దీనివల్ల బ్యాటర్లపై భారం తగ్గడంతో పాటు మ్యాచ్‌‌ గెలిచే అవకాశాలు రెట్టింపవుతాయి. ఇక కొత్త డ్యూక్‌‌ బాల్‌‌ గతంలో కంటే ఎక్కువగా స్వింగ్‌‌ అవుతోంది. దీన్ని సరిగ్గా ఉపయోగించే ఐదుగురు బౌలర్లు జట్టులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ నెగ్గడం ఈజీ అవుతుంది.

Tags:    

Similar News