Team India’s Poor Show: టీమిండియా దారుణం.. లాస్ట్ 9 టెస్టుల్లో ఒక్కటే

లాస్ట్ 9 టెస్టుల్లో ఒక్కటే;

Update: 2025-06-25 16:49 GMT

Team India’s Poor Show: టీమిండియాతో టెస్ట్ మ్యాచ్ అంటే ఇతర జట్లు బయపడేటట్టు చేసింది. అయితే ఇదంతా సంవత్సరం క్రితం..ఇపుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. విజయాలు సాధించడంలో టీమిండియా తడబడుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ పై 0-3 తో వైట్ వాష్ కావడంతో టీమిండియా పతనం ప్రారంభమైంది. ఈ సిరీస్ ఓటమితో టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 1-3 తేడాతో కోల్పోయింది. తాజాగా లీడ్స్ వేదికగా మంగళవారం (జూన్ 24) ముగిసిన టెస్టులో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది.

భారత్ ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్ ల్లో కేవలం ఒక టెస్టులోనే గెలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా పెర్త్ టెస్టులో ఈ విజయం వచ్చింది. ఒక మ్యాచ్ డ్రా కాగా.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. చివరి 9 టెస్టుల్లో టీమిండియాదే చెత్త రికార్డ్. బంగ్లాదేశ్, వెస్టిండీస్ తమ చివరి 9 మ్యాచ్ ల్లో రెండు టెస్టులు గెలిస్తే.. పాకిస్థాన్, శ్రీలంక 3 విజయాలు సాధించాయి. అత్యధికంగా సౌతాఫ్రికా తామాడిన చివరి 9 మ్యాచ్ ల్లో 8 విజయాలతో టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా 6, ఇంగ్లాండ్ 5, న్యూజిలాండ్ 4 విజయాలు సాధించాయి. భారత్ రానున్న సిరీస్ లలో సీరియస్ గా ఆడకపోతే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పై మరోసారి ఆశలు వదులుకోవాల్సిందే.

Tags:    

Similar News