Nikhat Zareen: సెమీ ఫైనల్ కు తెలంగాణ స్టార్ బాక్సర్
తెలంగాణ స్టార్ బాక్సర్;
By : PolitEnt Media
Update: 2025-06-30 05:06 GMT
Nikhat Zareen: తెలంగాణ స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్.. ఎలైట్ విమెన్స్ బాక్సింగ్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన విమెన్స్ 51 కేజీ క్వార్టర్స్‌లో నిఖత్ 5–0తో కల్పనపై గెలిచింది. బౌట్ ఆరంభం నుంచే నిలకడగా పంచ్‌లు విసిరిన నిఖత్ చివరివరకు దాన్ని కొనసాగించింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే చాన్స్ ఇవ్వలేదు. 65 కేజీల బౌట్‌లో అంకుషిత బోరో 5–0తో పార్థివి (రాజస్తాన్)ను ఓడించింది. ఇతర క్వార్టర్స్ బౌట్స్‌లో ప్రీతి (54 కేజీ), జ్యోతి (51 కేజీ), దేవికా గోర్పడే (51 కేజీ) ఏకగీవ్ర విజయాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టారు. వి. లక్ష్య (51 కేజీ) 5–0తో లక్ష్మిదేవిపై నెగ్గగా, తను (54 కేజీ), యాషి శర్మ (65 కేజీ) తమ ప్రత్యర్థులను ఓడించారు.