Cricket: ఇండియాతో టెస్ట్ సిరీస్..ఇంగ్లాండ్ కు బ్యాడ్ న్యూస్
ఇంగ్లాండ్ కు బ్యాడ్ న్యూస్;
Cricket: ఇండియాతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బ్యాడ్‌న్యూస్. కాలిపిక్క కండర గాయంతో స్టార్ పేసర్గస్ అట్కిన్సన్ తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. గత నెలలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌లో అట్కిన్సన్కు ఈ గాయమైంది. దాంతో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు అతను దూరమయ్యాడు.
కెరీర్లో 12 టెస్ట్‌లు ఆడిన అట్కిన్సన్ మూడుసార్లు ఐదు వికెట్ల హాల్ సాధించాడు. ఫలితంగా ఇంగ్లండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కీలకంగా మారాడు. ఇక మార్క్ వుడ్, ఒలీ స్టోన్ గాయాలతో ఇబ్బందిపడుతుండటం, ఇప్పుడు అట్కిన్సన్పై కూడా సందిగ్ధత నెలకొనడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. మరోవైపు బొటన వేలి గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ టెస్ట్ రీ ఎంట్రీ కూడా ఆలస్యమవుతోంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్)