BOWLER AKASHDEEP : భారత టెస్ట్ క్రికెట్ ఆశాదీపం... ఆకాష్ దీప్
తన బౌలింగ్ ప్రదర్శనను అక్కకు అంకితమిచ్చిన ఆకాష్;
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్‌లో భారత్ సాధించిన ఘన విజయం వెనుక స్టార్ బౌలర్ ఆకాశ్ దీప్ పాత్ర ఎంతో ఉంది. మ్యాచ్‌లో పది వికెట్లు తీసుకున్న పేసర్ ఆకాశ్ దీప్ తన ప్రదర్శనను అక్కకు అంకితమిచ్చాడు. అక్క అంటే ఆకాశ్‌కు ప్రాణం కంటే మిన్న. క్యాన్సర్‌తో పోరాడుతున్న అక్క మోముపై చిరునవ్వు చెదిరిపోకూడదంటూ అనుక్షణం దైవాన్ని ప్రార్థిస్తుంటాడు ఆకాశ్. 'ఈ మ్యాచ్‌లో నేను పది వికెట్లు తీసుకోవడం చూసి నువ్వు ఎంతో ఆనందపడి ఉంటావో ఊహించగలను. బాల్ అందుకున్న ప్రతీసారి నా మనసులో ఆలోచనలు సుడిగుండాల్లా తిరుగుతుంటాయి. సదా నీ రూపమే నా మదిలో మెదులుతుంటుంది. నిన్ను సంతోషపరచాలన్నదే నా తాపత్రయం. మేమంతా ఎప్పుడూ నీతోనే ఉంటాం. నీ వెన్నంటే నిలబడుతాం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఆకాశ్‌దీప్. తన అచీవ్‌మెంట్‌ను అక్కకు అంకితమిచ్చి తన ప్రేమను చాటుకున్నాడు.