Liz Laws Reveals Shocking Truths: కోహ్లీని తిడితే కోట్లు ఇస్తామన్నారు.. సంచలన నిజాలు బయటపెట్టిన లిజ్‌లాజ్!

సంచలన నిజాలు బయటపెట్టిన లిజ్‌లాజ్!

Update: 2026-05-13 05:14 GMT

Liz Laws Reveals Shocking Truths: టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈసారి ఆయన ఆట వల్ల కాదు.. ఆయనపై జరిగిన ఒక భారీ కుట్ర బయటపడటంతో నెట్టింట చర్చ మొదలైంది. జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి.

గతంలో లిజ్‌లాజ్ అనే జర్మన్ మోడల్ ఇన్‌స్టా ఫోటోకు కోహ్లీ లైక్ కొట్టడం పెద్ద వైరల్ అయ్యింది. ఆ చిన్న లైక్ ఆమెను రాత్రికి రాత్రే ఫేమస్ చేసింది. అయితే, ఈ ఫేమ్‌ను అడ్డం పెట్టుకుని కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లిజ్‌లాజ్ మాట్లాడుతూ.. "కోహ్లీ నా ఫోటో లైక్ చేశాక, కొందరు జర్నలిస్టులు నా దగ్గరకు వచ్చారు. కోహ్లీ నాకు పర్సనల్‌గా మెసేజ్‌లు చేస్తున్నాడని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అబద్ధాలు చెప్పమని నన్ను కోరారు" అంటూ బాంబు పేల్చింది.

అంతేకాదు, కోహ్లీపై లేనిపోని ఆరోపణలు చేస్తే భారీగా డబ్బు ఇస్తామని కూడా ఆఫర్ చేశారట. కానీ, లిజ్‌లాజ్ అందుకు ససేమిరా అంది. "నేను డబ్బు కోసం లేదా పాపులారిటీ కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని ఎందుకు దెబ్బతీస్తాను? కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం, పిచ్చి కూడా. ఆయన ఇమేజ్‌ను చెడగొట్టే ఉద్దేశం నాకు లేదు" అని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. కోహ్లీ ఫ్యాన్స్ "కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక లిజ్‌లాజ్ విషయానికొస్తే.. ఆమె కేవలం మోడల్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సైకాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఆమెకు జర్మన్, డచ్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో మంచి పట్టు ఉంది. ఆమె ఒక సర్టిఫైడ్ లైఫ్ సేవింగ్ స్విమ్మర్ కూడా. ఫుడ్ వ్లాగింగ్, సాంగ్ రైటింగ్ అంటే ఆమెకు ప్రాణం. గతంలోనే తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని అని ఆమె ప్రకటించింది.

Tags:    

Similar News