Series Clinched by India: రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ.. ఇండియాదే సిరీస్
ఇండియాదే సిరీస్;
Series Clinched by India: ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో ఇండియా 'ఏ' మహిళల జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 'ఏ' జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో యాస్టికా భాటియా, రాధా యాదవ్, తనుజా కన్వర్ కీలక పాత్ర పోషించడంతో ఇండియా విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 'ఏ' జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ 91 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 'ఏ' జట్టు, ఒకానొక దశలో 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే కష్టాల్లో ఉన్న టీమిండియాను తనుజా కన్వర్ (50 పరుగులు), ప్రేమ రావత్ (32 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు, యాస్టికా భాటియా (66), రాధా యాదవ్ (60) కూడా అర్ధ సెంచరీలు సాధించి జట్టు స్కోరును పటిష్టం చేశారు. చివరగా ఇండియా 'ఏ' జట్టు 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సిరీస్ లో మూడో వన్డే ఆదివారం జరగనుంది.