Today in Asia Cup: ఇవాళ ఆసియా కప్ లో శ్రీలంకతో భారత్ ఢీ

శ్రీలంకతో భారత్ ఢీ

Update: 2025-09-26 05:09 GMT

Today in Asia Cup: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఈ రోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఒక విధంగా నామమాత్రమే, ఎందుకంటే భారత్ ఇప్పటికే సూపర్ 4 లో ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు, శ్రీలంక తమ రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ భారత్‌కు ఒక మంచి ప్రాక్టీస్ అవకాశం. ఫైనల్‌కు ముందు తమ బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవడానికి, రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇది సరైన సమయం. ఇదే సమయంలో సంజూ శాంసన్ మిడిలార్డర్ కు సెట్ కాలేకపోవడంతో అతడి స్థానంలో జితేశ్ శర్మకు ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక లాస్ట్ మ్యాచ్ ను విజయంతో ముగించాలని చూస్తోంది.

మరో వైపు పాకిస్తాన్,బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించడంతో, పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.

Tags:    

Similar News