US Open 2025 Starts Today: ఇవాళ్టి నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్;
US Open 2025 Starts Today: ఈరోజు, రేపు రెండు రోజుల పాటు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్ జరుగుతుంది.ఈ రోజు, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లోని మొదటి,రెండవ రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. రేపు (ఆగస్టు 20న) సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ ఉంటాయి.
మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో నొవాక్ జొకోవిచ్ , ఓల్గా డానిలోవిచ్ జోడీ మిర్రా ఆండ్రీవా, డానిల్ మెద్వెదెవ్ (Daniil Medvedev) జోడీతో తలపడతారు. కార్లోస్ అల్కరాజ్ , ఎమ్మా రదుకాను జోడీ టాప్ సీడ్‌లు అయిన జెస్సికా పెగులా, జాక్ డ్రేపర్ జోడీతో పోటీపడతారు. సారా ఎర్రాని, ఆండ్రియా వవాస్సోరి (Andrea Vavassori) తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించనున్నారు.
యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 24న మొదలై సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. న్యూయార్క్ నగరంలోని USTA బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్. ఈసారి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌ను టోర్నమెంట్ ప్రధాన డ్రాకు ముందే నిర్వహించడం విశేషం. మిక్స్‌డ్ డబుల్స్ విజేత జట్టుకు వన్ మిలియన్ డాలర్ల బహుమతి లభిస్తుంది.