Vaibhav Suryavanshi: "రైనా రికార్డ్ బద్దలు.. వైభవ్ సూర్యవంశీ ఊచకోత

వైభవ్ సూర్యవంశీ ఊచకోత

Update: 2026-03-31 06:02 GMT

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. సోమవారం (మార్చి 30) గౌహతిలోని బర్సపరా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును అధిగమించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో సంయుక్తంగా మూడవ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే యూసుఫ్ పఠాన్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్ వంటి దిగ్గజాల సరసన వైభవ్ చేరిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో యశస్వి జైస్వాల్ (13 బంతులు), కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్, రోమారియో షెపర్డ్ (తలో 14 బంతులు) మాత్రమే వైభవ్ కంటే వేగంగా హాఫ్ సెంచరీ సాధించారు. 16 బంతుల్లో ఫిఫ్టీ మార్కును అందుకున్న సురేష్ రైనా, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి దిగ్గజాలను వైభవ్ వెనక్కి నెట్టడం విశేషం.

రాజస్థాన్ రాయల్స్ తరపున యశస్వి జైస్వాల్ తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. గత ఏడాది గుజరాత్ టైటాన్స్‌పై 17 బంతుల్లో ఫిఫ్టీ చేసిన వైభవ్, ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాశాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టులో వైభవ్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిపోయాడు. మొత్తంగా 17 బంతుల్లో 52 పరుగులు చేసి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, అప్పటికే చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు. మొదటి పూర్తి టోర్నమెంట్ ఆడుతున్న ఈ కుర్రాడు ఇలాంటి ఫామ్‌లో ఉండటం రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Tags:    

Similar News