Sunrisers' Bowling Coach: సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్
బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్;
By : PolitEnt Media
Update: 2025-07-15 05:45 GMT
Sunrisers' Bowling Coach: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ బౌలింగ్ కోచ్‌గా ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌ను నియమించింది. న్యూజిలాండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో ఆరోన్ బాధ్యతలు చేపడతాడు. ఆరోన్ ఒకప్పుడు టీమిండియాలో కీలక ఫాస్ట్ బౌలర్‌గా ఉండేవాడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
2011 నుంచి 2015 వరకు ఇండియా తరఫున 9 టెస్టులు, 9 వన్డేల్లో పోటీపడ్డాడు. అయితే, తరచుగా గాయపడటంతో తన ఇంటర్నేషనల్ కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. కొంతకాలం క్రితమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆరోన్ ఆ తర్వాత కామెంటేటర్‌గా మారాడు.