Vian Mulder: జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.
ట్రిపుల్ సెంచరీకి అవకాశమున్నా 367* రన్స్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అయినా పలు రికార్డులు బద్దలుకొట్టారు. విదేశాల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఒక టెస్టులో హయ్యెస్ట్ రన్స్ చేసిన సౌతాఫ్రికన్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు.
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ముల్డర్ నిలిచాడు. లారా 400 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 2003 లో ఇంగ్లాండ్ పై లారా 400 పరుగుల మార్క్ అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ హైడెన్ 380 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 375 పరుగులతో లారా.. 374 పరుగులతో జయవర్ధనే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.