Mohammad Kaif Warns: వైస్ కెప్టెన్ అయినా ప్లేస్ గ్యారంటీ లేదు.. తిలక్ వర్మకు మహ్మద్ కైఫ్ వార్నింగ్

తిలక్ వర్మకు మహ్మద్ కైఫ్ వార్నింగ్

Update: 2026-06-27 05:00 GMT

Mohammad Kaif Warns: భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. సీనియర్లకు విశ్రాంతినిస్తూ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న ఈ సిరీస్‌లో.. టీమిండియా సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. యువ సంచలనం, తెలుగు తేజం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్‌గా సెలక్టర్లు ప్రమోషన్ ఇచ్చారు.

తిలక్ వర్మ కెరీర్‌లో ఇదొక అద్భుతమైన మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, వైస్ కెప్టెన్ అయ్యాడు కదా అని తిలక్ వర్మ రిలాక్స్ అవ్వడానికి వీల్లేదని.. బాధ్యతలతో పాటు అంచనాలు కూడా భారీగా పెరిగాయని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సున్నితంగా హెచ్చరించాడు.

ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కైఫ్.. తిలక్ వర్మకు టీమిండియా కంపిటీషన్ ఎలా ఉంటుందో గుర్తు చేశాడు. "తిలక్ వర్మ ఇప్పుడు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ అందుకొన్నాడు. కానీ, డిప్యూటీ అయినంత మాత్రాన అతడికి తుది జట్టులో స్థానం గ్యారంటీ అని అర్ధం కాదు. అలా ఆలోచిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అతడు జట్టులో ఉండాలనుకుంటే.. కచ్చితంగా ఫామ్‌ను కొనసాగించాలి. ఒకవేళ పరుగులు చేయలేకపోతే.. వైస్ కెప్టెన్ అయినా సరే జట్టు నుంచి డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ పరిస్థితి కూడా ఇలాగే జరిగిందని.. తిలక్ వర్మ వారిద్దరినీ గుర్తు పెట్టుకోవాలి" అని కైఫ్ గట్టిగానే హెచ్చరించాడు.

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తూ.. "భారత జట్టులో సరిగా ఆడని ఎవరైనా సరే తమ స్థానంపై ధీమాగా ఉండకూడదు. అది కెప్టెన్ అయినా సరే! ఇక్కడ పర్మినెంట్ వైస్ కెప్టెన్ అంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ తమ ప్లేస్ కోసం పరుగులు చేయాల్సిందే. ఇప్పుడున్న కోచ్, సెలక్టర్ల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ప్రతి మ్యాచ్‌లో ప్లేయర్ ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి" అని కైఫ్ క్లియర్ కట్‌గా చెప్పేశాడు.

Tags:    

Similar News