Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో సత్తా చాటిన తెలంగాణ క్రికెటర్

డబుల్ సెంచరీతో సత్తా చాటిన తెలంగాణ క్రికెటర్

Update: 2026-01-07 05:31 GMT

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ లో తెలంగాణకు చెందిన యువ క్రికెటర్ అమన్ రావు (పేరాల అమన్ రావు) అద్భుతమైన డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించారు.మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అమన్ ఈ ఘనత సాధించారు. కేవలం 154 బంతుల్లో 200 పరుగులు (నాటౌట్) గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మరీ తన డబుల్ సెంచరీ మార్కును అందుకోవడం విశేషం.టీమ్ ఇండియా స్టార్ బౌలర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్‌ల బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 50 ఓవర్లలో 352/5 పరుగులు చేయగా, అనంతరం బెంగాల్‌ను 245 పరుగులకే ఆలౌట్ చేసి 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో హైదరాబాద్ (తెలంగాణ) తరపున డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ అమన్ రావు.: 1994లో గోవాపై మొహమ్మద్ అజహరుద్దీన్ చేసిన 161 పరుగుల రికార్డును అమన్ అధిగమించి, లిస్ట్-ఏ క్రికెట్‌లో హైదరాబాద్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచారు.అమన్ అమెరికాలోని విస్కాన్సిన్‌లో జన్మించారు, కానీ హైదరాబాద్‌లో పెరిగారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.

Tags:    

Similar News