IPL Special Shots: ఐపీఎల్ స్పెషల్ షాట్స్: సెహ్వాగ్ ఎంపిక చేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే!

సెహ్వాగ్ ఎంపిక చేసిన టాప్ ప్లేయర్లు వీళ్లే!

Update: 2026-04-18 01:49 GMT

IPL Special Shots: క్రికెట్ అంటేనే పరుగుల విందు.. ఆ పరుగులకు అందాన్ని ఇచ్చేవి క్రికెటర్లు ఆడే అద్భుతమైన షాట్లు! మరి ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏ షాట్‌ను ఎవరు పర్ఫెక్ట్‌గా ఆడతారో తెలుసా? సాక్షాత్తు 'నజఫ్‌గఢ్ నవాబ్' వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా తన ఫేవరెట్ షాట్స్, వాటి మాస్టర్లను ప్రకటించారు. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

ముందుగా క్రికెట్‌కే కింగ్ లాంటి షాట్.. కవర్ డ్రైవ్! దీనికి విరాట్ కోహ్లీ తప్ప మరొక పేరు సెహ్వాగ్‌కు గుర్తుకు రాలేదు. ఆ క్లాసిక్ టైమింగ్ కోహ్లీ సొంతం. ఇక బంతిని గాల్లోకి లేపే పుల్ షాట్ విషయంలో వైభవ్ అదరగొడుతుంటే.. ఫుట్ వర్క్ , మణికట్టు మాయాజాలంతో ఆడే ఫ్లిక్ షాట్‌కు యువ సంచలనం ఆయుష్ మాత్రేను ఎంపిక చేశారు వీరూ.

ఇక గ్రౌండ్‌లో 360 డిగ్రీల మాయాజాలం మొదలైతే.. అక్కడ వినిపించే పేరు సూర్య కుమార్ యాదవ్! స్కూప్ షాట్ అయినా, స్వీప్ షాట్ అయినా సూర్య ఆడితే ఆ మజాయే వేరు. అలాగే, క్రికెట్ చరిత్రలోనే వినూత్నమైన ర్యాంప్ షాట్‌కు ఇప్పటికీ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తప్ప ఎవరూ సాటిరారని సెహ్వాగ్ తేల్చి చెప్పారు.

మరి స్ట్రెయిట్ డ్రైవ్? దీనికి సంజూ శాంసన్ క్లాస్ టచ్‌ను సెలెక్ట్ చేశారు. ఇక బౌలర్ల లయను దెబ్బతీసే రివర్స్ స్వీప్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్, పవర్‌ఫుల్ కట్ షాట్‌లో ప్రియాంశ్ ఆర్య ప్రత్యేకతను చాటుకుంటున్నారని సెహ్వాగ్ ప్రశంసించారు. చివరగా బంతి లైన్‌ను అంచనా వేసి ఆడే ఇన్‌సైడ్ ఔట్ షాట్‌కు దేవదత్ పడిక్కల్ పర్ఫెక్ట్ అని వీరూ పేర్కొన్నారు.

Tags:    

Similar News