England: ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు టీమిండియా రెడీ అవుతోంది. ఇవాళ్టి నుంచి ఇండియా, ఇండియా-ఎ జట్ల మధ్య నాలుగు రోజుల వామప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా ప్రధాన సిరీస్లో ఆడే ప్లేయర్ల ఫామ్, బౌలింగ్ కాంబినేషన్ ను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా, లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగు నిశితంగా పరిశీలించనున్నారు. జట్టు వ్యూహాలు, ప్లేయర్ల ఆటతీరుపై ప్రత్యర్థులకు ఎలాంటి సమాచారం లీక్ కాకుండా గంభీర్ బృందం 'క్లోజ్డ్ డోర్ సెషన్'ను ఎంచుకుంది. రోజుకు 90 ఓవర్లు బౌలింగ్, ఫీల్డింగ్ చేసే సామర్ధ్యాన్ని పెంపొందించుకునే దిశగా టీమిండియా కసరత్తులు చేస్తోందని బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్ వెల్లడించాడు. దాంతో సాధారణ నెట్ సెషన్స్తో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉండనుంది.

అధికారిక ఫస్ట్ క్లాస్ హోదా లేని ఈ మ్యాచ్లో ఎవరైనా బ్యాటర్ త్వరగా ఔటైతే రెండో చాన్స్ ఇస్తారు. నాలుగురోజుల్లో కలిపి 360 ఓవర్ల మ్యాచ్ జరుగు తుంది. బౌలర్లు తమకు కావా ల్సినన్ని ఓవర్లు వేసుకునే వెసులు బాటు కూడా లభిస్తుంది. స్పిన్నర్, పేసర్ తమ బౌలింగ్ లయను సిమ్యులేషన్ పై చూసుకోవచ్చు. ‘సెనా 'దేశాల పిచ్ పై జడేజా బ్యాటింగ్ అత్యుత్తమంగా ఉంటుంది. కానీ ఇంగ్లండ్ బజ్వాలర్స్కు వ్యతిరేకంగా కుల్దీప్ యాదవన్ను బరిలోకి దించే చాన్స్ ఉంది. కాబట్టి తొలి టెస్ట్ లో ఆడే ఏకైక స్పిన్నర్ ఎవరనేది గంభీర్ బృందం వెతికి పట్టుకోవాల్సి ఉంది. ప్రధాన పేసర్ బుమ్రాను ఆడించొచ్చు. అయితే బ్యాక్ పెయిన్ కారణంగా అతనితో ఎన్ని స్పెల్స్ వేయించాలో ఇందులో నిర్ణయించనున్నారు. ఫుల్లర్ లెంగ్త్ ఆకాశ్ దీప్, బ్యాక్ ఆఫ్ ద లెంగ్ తో ప్రసిధ్ కృష్ణ మధ్య పోటీ నెలకొంది.

Tags: