Sandeep Patil in a Shocking Statement: సచిన్ ను అపుడే తప్పించాలనుకున్నాం.. సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు
Sandeep Patil in a Shocking Statement: బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌కు ముందు జరిగిన పరిణామాలపై సంచలన విషయాలు వెల్లడించారు. 2012లో సచిన్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో, సెలెక్షన్ కమిటీ ఆయన రిటైర్మెంట్ గురించి ఆలోచించిందని ఆయన పేర్కొన్నారు.
2012 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో నాగ్‌పూర్ టెస్ట్ ముగిసిన తర్వాత, సందీప్ పాటిల్ స్వయంగా సచిన్‌ను కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగారు. అప్పుడు పాటిల్ "సెలెక్షన్ కమిటీ మీ స్థానంలో మరొకరిని చూడాలనుకుంటోంది" అని చెప్పగానే సచిన్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆ సమయంలో సచిన్ ఆశ్చర్యపోతూ.. "మీరు సీరియస్‌గానే చెబుతున్నారా?" అని తిరిగి అడిగారని పాటిల్ గుర్తుచేసుకున్నారు. దానికి పాటిల్ "అవును" అని బదులిచ్చారు.
సెలెక్టర్లు ఎవరినీ బలవంతంగా రిటైర్ చేయలేరని, కానీ జట్టు నుండి తప్పించే (drop) అధికారం వారికి ఉంటుందని పాటిల్ స్పష్టం చేశారు. సచిన్ ఆ సమయంలో "నేను ఆడాలని అనుకుంటున్నాను" అని చెప్పినప్పటికీ, సెలెక్షన్ కమిటీ ఆలోచనను అర్థం చేసుకున్న ఆయన, కొద్దిరోజులకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ మీటింగ్ జరిగిన దాదాపు ఏడాది తర్వాత (నవంబర్ 2013) సచిన్ తన 200వ టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు.
ఆ సమయంలో అజింక్యా రహానే వంటి యువకులను జట్టులోకి తీసుకురావాలని సెలెక్షన్ కమిటీ భావించిందని, అందుకే ఆ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పాటిల్ తెలిపారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వెనుక ఉన్న ఈ 'ఇన్ సైడ్ స్టోరీ' ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.