SRH Captain Pat Cummins Turns Serious: డబ్బు కోసం దేశాన్ని వదులుతానా?..SRH కెప్టెన్ కమిన్స్ సీరియస్.

SRH కెప్టెన్ కమిన్స్ సీరియస్.

Update: 2026-05-15 02:11 GMT

SRH Captain Pat Cummins Turns Serious: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన గురించి వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని, అవన్నీ కల్పితాలని కమిన్స్ తేల్చి చెప్పారు.

"అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన టాప్ క్రికెటర్లు భారీ మొత్తంలో డబ్బు ఇస్తేనే స్వదేశీ లీగ్ అయిన ‘బిగ్ బాష్’లో ఆడతామని, లేదంటే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు వెళ్తామని హెచ్చరించినట్లు ఆస్ట్రేలియా పత్రిక ‘ద ఏజ్’ ఒక కథనాన్ని ప్రచురించింది. కనీసం 1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 9.57 కోట్ల రూపాయలు ఇస్తేనే ఆడతామన్న నిబంధన పెట్టారని, అందులో కమిన్స్ పేరు కూడా ఉందని ఆ వార్త సారాంశం.

"అంతేకాకుండా, ఎస్‌ఏ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరినట్లు, అలాగే జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లతో కలిసి ‘ద హండ్రెడ్’ టోర్నీలో ఆడేందుకు కమిన్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో కమిన్స్ స్వయంగా రంగంలోకి దిగారు.

నా గురించి మీరు రాసిన ప్రతి మాట కల్పితమే.. ఎస్‌ఏ టీ20కి ఎన్‌వోసీ కోరానన్నది, ద హండ్రెడ్ ఆఫర్ వచ్చిందన్నది ముమ్మాటికీ సత్యదూరం' అని కమిన్స్ స్పష్టం చేశారు. పేమెంట్ సమస్య వల్ల తన దేశ టోర్నీని వదిలేస్తున్నానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News