Second Test Against South Africa: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఇండియాకు ఓటమి తప్పదా.?
ఇండియాకు ఓటమి తప్పదా.?
Second Test Against South Africa:సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (58), వాషింగ్టన్ సుందర్ (48) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 6/48 తో అద్భుతంగా రాణించాడు.టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో జాన్సెన్ ధాటికి పూర్తిగా తేలిపోయింది. తొలి మూడు వికెట్లు సఫారీలకు స్పిన్నర్ల రూపంలో వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ స్టార్ పేసర్ హవా స్టార్ట్ అయింది. పేసర్లకు అంతగా సహకరించని భారత పిచ్ లపై బౌన్సర్లు విసురుతూ మూడో రోజు రెండో సెషన్ లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు మొదటి ఇన్నింగ్స్ లో 88 పరుగుల ఆధిక్యం లభించింది సౌతాఫ్రికా 'ఫాలోఆన్' అమలు చేయకుండా రెండో ఇన్నింగ్స్ ఆడటానికి మొగ్గు చూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి, సౌతాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసి, మొత్తం 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.ర్యాన్ రికెల్‌టన్ (13), ఐడెన్ మార్‌క్రమ్ (12)క్రీజులో ఉన్నారు.దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించింది. నాలుగో రోజు డిక్లేర్ చేసి, భారత్‌కు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటమికి చేరువైన టీమిండియా డ్రా చేసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.