Wonder Kid Vaibhav: ఇంగ్లాండ్ సిరీస్లోనైనా వండర్ కిడ్ వైభవ్కు ఛాన్స్ దక్కుతుందా?
ఛాన్స్ దక్కుతుందా?
Wonder Kid Vaibhav: వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఐర్లాండ్ సిరీస్లోనే ఈ యంగ్ సెన్సేషన్ బరిలోకి దిగుతాడని అందరూ ఆశించారు. కానీ, మేనేజ్మెంట్ సీనియర్లకే మొగ్గు చూపింది. ఫలితం? ఐర్లాండ్ చేతిలో టీమిండియా బొక్కబోర్లా పడింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షురూ కాబోతోంది. మరి కనీసం ఇప్పుడైనా సూర్యవంశీని ఆడిస్తారా? లేక పాత పద్ధతులనే నమ్ముకుంటారా? ఐర్లాండ్ షాక్ తర్వాత గంభీర్ అండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దీనిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందిస్తూ.. 'ఐర్లాండ్ సిరీస్లోనే సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాల్సింది. ఒక మ్యాచ్లో అభిషేక్, మరో మ్యాచ్లో శాంసన్కు రెస్ట్ ఇచ్చి ఉండాల్సింది. ఇంగ్లండ్తో జరిగే మొదటి మ్యాచ్ నుంచే సూర్యవంశీని ఓపెనర్గానో, లేదా మూడో స్థానంలోనో ఖచ్చితంగా ఆడించాలి' అని స్ట్రాంగ్ సలహా ఇచ్చారు.
అసలు లోపమంతా ఐపీఎల్ పిచ్లతోనే వస్తోంది! అక్కడ 'నేషనల్ హైవేస్' లాంటి ఫ్లాట్ పిచ్లపై, 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్తో చెలరేగిపోయే మన బ్యాటర్లు.. ఇంటర్నేషనల్ మ్యాచ్లలో బౌలింగ్ పిచ్లు రాగానే ప్లాన్-బి లేక చేతులెత్తేస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్లో ఒక మ్యాచ్లో 5 రన్స్, మరో మ్యాచ్లో డకౌట్ అయిన సంజూ శాంసన్ టెక్నిక్ ఇక్కడ ఫెయిల్ అయింది.
ఇప్పుడు టీమ్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా సూర్యవంశీని లోపలికి తేవాలంటే.. సంజూ శాంసన్ను పక్కన పెట్టడమే కరెక్ట్ ఆప్షన్. శివమ్ దూబే పూర్తి స్థాయి బౌలర్ కాకపోవడం టీమిండియాకు పెద్ద మైనస్. మరి టీమ్ ఫ్యూచర్ కోసం గంభీర్ సేన ఆ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా? ఇంగ్లాండ్పై వండర్ కిడ్ అరంగేట్రం జరుగుతుందా? వేచి చూడాలి.