Women's Premier League (WPL) 2026: WPL లో ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి..
ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి..
Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 లో ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ సోఫీ డివైన్ కేవలం 42 బంతుల్లో 95 పరుగులు (7 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ చివరి ఓవర్లో ఢిల్లీకి 7 పరుగులు అవసరమైన దశలో కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి జట్టును గెలిపించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 209 రన్స్‌కు ఆలౌటైంది. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్ లిజెల్ లీ (86), కెప్టెన్ లారా వోల్వార్డ్ (77) అద్భుతంగా ఆడారు. ఒక దశలో ఢిల్లీ గెలిచేలా కనిపించినా, ఆఖరి ఓవర్లో తడబడింది.ఢిల్లీ బౌలర్ నందిని శర్మ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మొత్తం 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించింది. గుజరాత్ భారీ స్కోరు చేయకుండా ఇన్నింగ్స్ చివరలో ఆమె కట్టడి చేసింది. ఢిల్లీ 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.