Women's Premier League (WPL) 2026: WPLలో ఐదో విక్టరీ..ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్
Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) నాలుగో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. సోమవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ (knockout stage) కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 178/6 పరుగులు చేసింది. యువ ప్లేయర్ గౌతమి నాయక్ కేవలం 55 బంతుల్లో 73 పరుగులు (7 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టును ఆదుకుంది.రిచా ఘోష్ చివర్లో 20 బంతుల్లో 27 పరుగులు చేసి స్కోరును పెంచింది.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 117/8 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ గార్డ్‌నర్ తప్ప మిగతా వాళ్లు బ్యాట్లెత్తేయడంతో ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీ ఇవ్వలేకపోయింది. స్కోరుబోర్డుపై ఐదు రన్స్ చేరే లోపే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. పేసర్ సాయలీ సత్ఘరే (3/21) మూడు వికెట్లతో గుజరాత్ వెన్ను విరిచింది. నదైన్ డి క్లెర్క్ కూడా 2 వికెట్లు తీసింది.ప్రస్తుతం ఆర్సీబీ 5 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.