World Cup Schedule: వరల్డ్ కప్ షెడ్యూల్..భారత్,పాక్ మ్యాచ్ ఎపుడంటే.?

భారత్,పాక్ మ్యాచ్ ఎపుడంటే.?;

Update: 2025-06-16 11:20 GMT

World Cup Schedule: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది. మొత్తం ఎనిమిది జట్లు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. 2025సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

సెప్టెంబర్ 30న ఆతిథ్య భారత్.. శ్రీలంకతో టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడుతుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రోజు అక్టోబర్ 1 న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.

అందరూ ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబో వేదికగా అక్టోబర్ 5 న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. 2022 రన్నరప్ ఇంగ్లాండ్ అక్టోబర్ 3న తమ తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో ఆడనుంది. రౌండ్-రాబిన్ దశ అక్టోబర్ 26 వరకు జరుగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 29,30 తేదీలలో జరగనున్నాయి. నవంబర్ 2న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. రౌండ్-రాబిన్ లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీ ఫైనల్ ఆడతాయి.

Tags:    

Similar News