Women's Premier League (WPL) 2026: WPL: ఆర్సీబీ vs ఢిల్లీ..ఇవాళే ఫైనల్ పోరు
ఇవాళే ఫైనల్ పోరు
Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ మ్యాచ్ ఇవాళే జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు ఈ టైటిల్ కోసం తలపడనున్నాయి.BCA స్టేడియం, కొతంబి, వడోదర.
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2024లో జరిగిన ఫైనల్లో కూడా ఈ రెండు జట్లే తలపడ్డాయి. అప్పుడు ఆర్సీబీ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. గత మూడు సీజన్లలో తుది మెట్టుపై బోల్తా పడ్డ ఢిల్లీ నాలుగో ప్రయత్నంలో అయినా కప్పు కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉండగా.. రెండుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. లీగ్ దశలో వరుసగా ఐదు విజయాలతో అదరగొట్టిన స్మృతి మంధాన సేన నేరుగా ఫైనల్‌కు చేరగా .. ఎలిమినేటర్‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ ను చిత్తు చేసిన డీసీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో తుదిపోరుకు వచ్చింది. గతేడాది ఫైనల్లో ఆర్సీబీ చేతిలోనే ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు కసిగా ఉంది.
ఢిల్లీ స్క్వాడ్:
లిజెల్ లీ(వికెట్ కీపర్ ), షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్), మారిజాన్ కాప్, చినెల్లే హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ, అలనా కింగ్, తానియా సింగ్రు ఇ, ప్రగతి హమిల్టోన్డ్, లూసీల భాటియా,
ఆర్సీబీ జట్టు :
గ్రేస్ హారిస్, స్మృతి మంధాన( కెప్టెన్), జార్జియా వోల్, రిచా ఘోష్(వికెట్ కీపర్ ), రాధా యాదవ్, నదీన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, లిన్సే హేమల, లిన్సే హేమల, గానమిత్ స్మిత్ రావత్