WTC Final: 145 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి
టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి;
WTC Final: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఒక ప్రత్యేక రికార్డు కూడా క్రియేట్ అయింది. రెండు జట్ల నంబర్ వన్ బ్యాట్స్‌మెన్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్ ఖవాజా, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యారు. ఖవాజా 20 బంతులు ఎదుర్కొనగా, మార్క్రామ్ 6 బంతులు ఆడాడు.
145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఇలా ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా (ప్రపంచంలో ఎక్కడైనా) చూసినా ఓ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇది 10వ సారి మాత్రమే. ఈ తరహా తొలి ఘటన 1977లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది.
1977లో ఆస్ట్రేలియా, భారత్ జరిగిన మెల్బోర్న్ టెస్ట్‌లో తొలిసారి ఇలాంటి సంఘటన జరిగింది, ఆ సమయంలో సునీల్ గవాస్కర్, జాన్ డైసన్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఈ సంఘటన మొదటి 100 సంవత్సరాల టెస్ట్ క్రికెట్లో (1877-1977) ఎప్పుడూ జరగలేదు. 1977 నుండి టెస్ట్ క్రికెట్ ఈ ప్రత్యేకమైన క్షణాన్ని 10 సార్లు మాత్రమే చూసింది.
99ఏళ్ల రికార్డ్ బద్దలు
ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా, స్మిత్ మాత్రం స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టకు గౌరప్రదమైన స్కోర్ అందించాడు. ఆసీస్ జట్టులో టాప్ స్కోర్ స్మిత్‌దే.