Cricket: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వార్‌కు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీల్లో అద్భుత రికార్డు, అపార అనుభవంతో కూడిన ఆస్ట్రేలియా.. చోకర్స్ ముద్రను చెరిపేసి ఐసీసీ ట్రోఫీ నెగ్గాలనే పట్టుదలతో నిండిన సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం2 గంటలకు అసలైన టెస్ట్ సమరం షురూ కానుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆసీస్ ట్రోఫీ నిలబెట్టుకోవాలని ఆశిస్తుండగా.. అద్భుత ఆటతో ఫైనల్‌కు వచ్చిన సఫారీలు తొలి ప్రయత్నంలోనే టెస్టు రారాజు అనిపించుకోవాలని భావిస్తోంది.
మెన్స్ క్రికెట్లో నాలుగు ఐసీసీ ట్రోఫీలైన వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలిచిన ఏకైక జట్టు ఆస్ట్రేలియానే. ఇప్పటివరకు ఆడిన 13 ఫైనల్స్‌లో పదింటిలో గెలిచిందంటే ఆ టీమ్ ఆధిపత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అదే జోరుతో ఇప్పుడు 11వ వరల్డ్ టైటిల్‌పై కన్నేసింది. సఫారీలు దీనికి పూర్తి భిన్నం. ఆ జట్టుకు కీలక మ్యాచ్‌ల్లో తడబడుతుందనే పేరుంది. 1998లో ఒక్కసారి మాత్రమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సఫారీ టీమ్ ఈ సారి చాలా బలంగా కనిపిస్తోంది
తుది జట్లు
సౌతాఫ్రికా: మార్క్రమ్, రికెల్టన్ (కీపర్), వియాన్ మల్డర్, బవూమ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్హామ్, కైల్ వెరెన్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ ( కీపర్), కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, లైయన్, హేజిల్‌వుడ్.