WTC Finals: ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్ మూడు ఇంగ్లాండ్ లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. వచ్చే 2027, 2029, 2031ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే జరుగుతాయని తెలిపింది. 2021 WTC ఫైనల్ సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో .. 2023 WTC ఫైనల్ లండన్‌లోని ఓవల్ మైదానంలో.. 2025 WTC ఫైనల్ లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగింది. ఈ మూడు ఫైనల్స్ విజయవంతంగా నిర్వహించినందుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB)కు ఈ అవకాశం కల్పించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపినప్పటికీ ICC ఇంగ్లాండ్ కే మొగ్గుచూపింది. జూన్ లో వాతావరణం అనుకూలంగా ఉండటం, గతంలో ఇంగ్లాండ్ విజయవంతంగా టోర్నమెంట్‌లను నిర్వహించడంతో ఇంగ్లాండ్ కు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.