WTC: నంబర్ 3లో భారత్

నంబర్ 3లో భారత్;

Update: 2025-08-05 07:45 GMT

WTC: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో ఈ ర్యాంక్ సాధించింది. లార్డ్స్ టెస్టులో స్లో ఓవర్ నెట్ రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ కు రెండు పాయింట్లు తగ్తించారు.

WTC ర్యాంకింగ్స్

3 మ్యాచ్‌లలో 3 విజయాలతో 100% పాయింట్ల పర్సంటేజీతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.

2 మ్యాచ్‌లలో 1 విజయం, 1 డ్రాతో 66.67 పాయింట్లతో శ్రీలంక రెండో స్థానంలో ఉంది.

5 మ్యాచ్‌లలో 2 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 46.67 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది.

5 మ్యాచ్‌లలో 2 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 43.33పాయింట్లతో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది.

2 మ్యాచ్‌లలో 1 ఓటమి, 1 డ్రాతో 16.67 పాయింట్లతో బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది.

3 మ్యాచ్‌లలో 3 ఓటములతో వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్, పాకిస్తాన్ సౌతాఫ్రికా జట్లు ఇంకా WTC లో తమ మొదటి మ్యాచ్ ఆడలేదు.

Tags:    

Similar News