Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్
Yashasvi Jaiswal: టీమ్ ఇండియా యువ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అనారోగ్యం కారణంగా పుణేలోని ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పుణేలో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) లో భాగంగా మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున జైస్వాల్ బరిలోకి దిగారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆయన తీవ్రమైన కడుపునొప్పికి (Stomach Cramps) గురయ్యారు. నొప్పి ఉన్నప్పటికీ ఆయన ఓపెనర్‌గా వచ్చి 15 పరుగులు చేశారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత నొప్పి మరింత ఎక్కువ కావడంతో ఆయన్ని వెంటనే పుణే (పింప్రి-చించ్‌వాడ్) లోని ఆదిత్య బిర్లా మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి, 'అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్' గా నిర్ధారించారు. ఇది సాధారణంగా పొట్ట, పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.వైద్యులు ఆయనకు ఐవీ ద్వారా మందులు అందించారు. అలాగే అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ వంటి పరీక్షలు కూడా నిర్వహించారు.
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.జైస్వాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సెంచరీతో (హర్యానాపై) అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు.