World Cup Berth: ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకున్న జింబాబ్వే
బెర్త్ ఖరారు చేసుకున్న జింబాబ్వే
World Cup Berth: వచ్చే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు జరుగుతున్న ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్స్ నుంచి జింబాబ్వేతో పాటు నమీబియా జట్లు ఫైనల్‌కు చేరి తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. గత ప్రపంచకప్‌కు ఉగాండా చేతిలో ఓటమి కారణంగా అర్హత సాధించలేకపోయిన జింబాబ్వే, ఈసారి ఆ లోటును భర్తీ చేసుకుంది. అక్టోబర్ 2న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో నమీబియా జట్టు టాంజానియాపై విజయం సాధించింది. జింబాబ్వే..కెన్యాపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరాయి.
వీరిద్దరి అర్హతతో ప్రపంచకప్‌కు చేరుకున్న జట్ల సంఖ్య 17కి చేరింది.
క్వాలిఫై అయిన మొత్తం జట్లు
ఇప్పటివరకు ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు: భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే. ఇంకా మూడు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాల్సి ఉంది. ఆ మూడు జట్లు ఆసియా క్వాలిఫయర్స్ ద్వారా ఖరారవుతాయి.
రేపు ఫైనల్ పోరు
క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. ఆఫ్రికా క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్ కోసం కెన్యా, నమీబియా జట్లు తలపడనున్నాయి.